Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంపీ చామల

డిసిసి (DCC) అధ్యక్షులు లకావత్ ధన్వంతి నాయకత్వంలో జనగామలో ఓట్ బచావో - దేశ్ బచావో చౌపాల్ కార్యక్రమం..

జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎంపీ చామల
Share Short Clip Download PDF

డిసిసి (DCC) అధ్యక్షులు లకావత్ ధన్వంతి నాయకత్వంలో జనగామలో ఓట్ బచావో - దేశ్ బచావో చౌపాల్ కార్యక్రమం..

జనగామ(రైట్స్ మీడియా): ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జనగామ నియోజకవర్గంలో నిర్వహించబడింది. ఎమ్మెల్సీ ఎన్నికల జనగామ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరింగింది.

ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని, సమన్వయంతో పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

డిసిసి (DCC) అధ్యక్షులు లకావత్ ధన్వంతి నాయకత్వంలో జనగామలో ఓట్ బచావో - దేశ్ బచావో చౌపాల్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఏఐసిసి (AICC) పరిశీలకులు కేబీఆర్ నాయుడు, టీపీసీసీ (TPCC) కోఆర్డినేటర్ అరికెల నర్సారెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు మరియు మీడియా కమ్యూనికేషన్ విభాగం రాష్ట్ర చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు మరియు మీడియా కమ్యూనికేషన్ విభాగం రాష్ట్ర చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

రాజ్యాంగబద్ధమైన హక్కులను, ఓటు హక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా 'ఓట్ బచావో - దేశ్ బచావో' కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి SSA ఇంచార్జ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కొమ్మూరి ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డిసిసి అధ్యక్షురాలు, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు మరియు మీడియా కమ్యూనికేషన్ విభాగం రాష్ట్ర చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..