జనగామ(రైట్స్ మీడియా): ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జనగామ నియోజకవర్గంలో నిర్వహించబడింది. ఎమ్మెల్సీ ఎన్నికల జనగామ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరింగింది.
ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని, సమన్వయంతో పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
డిసిసి (DCC) అధ్యక్షులు లకావత్ ధన్వంతి నాయకత్వంలో జనగామలో ఓట్ బచావో - దేశ్ బచావో చౌపాల్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఏఐసిసి (AICC) పరిశీలకులు కేబీఆర్ నాయుడు, టీపీసీసీ (TPCC) కోఆర్డినేటర్ అరికెల నర్సారెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు మరియు మీడియా కమ్యూనికేషన్ విభాగం రాష్ట్ర చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.