నిజామాబాద్(రైట్స్ మీడియా): ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో ఉదయం కందిపప్పు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.
లారీ బోల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. మహబూబ్‌నగర్ నుంచి నాగ్పూర్కు వైపు వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బోల్తాపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.