Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలి

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలి
Share Short Clip Download PDF

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్ (రైట్స్ మీడియా): తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ముంపునకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇతర అంశాలకు సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి తుమ్మిడిహెట్టి బ్యారేజీ అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ విషయంలో మహారాష్ట్రతో నిరంతరం సంప్రదింపులు జరపాలి

మహారాష్ట్రతో ఇటీవల జరిపిన చర్చలు, సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇందుకోసం అవసరమైన నిధులను జాయింట్ అకౌంట్‌లో ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భూముల ముంపు విషయంలో మహారాష్ట్ర చేపట్టే సర్వేకు అభ్యంతరం లేదని తెలిపారు.

మహారాష్ట్ర అధికారులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. ఈ సమీక్షలో నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.