హనుమకొండ (రైట్స్ మీడియా): జాతీయ స్థాయిలో నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో వరంగల్ నగరానికి అరుదైన గుర్తింపు లభించి అవార్డు రావడం గర్వకారణం అని కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి అన్నారు.
సోమవారం హనుమకొండ లోని కుడా కార్యాలయంలో వరంగల్ నగరానికి జాతీయ అవార్డు రావడం పట్ల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి...జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి, జీడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న, కుడా సీపీవో అజిత్ రెడ్డి, తదితరులను కుడా ఛైర్ పర్సన్ అభినందించారు.