హైదరాబాద్(రైట్స్ మీడియా): జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా నరకయాతన అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజల సమస్యను పరిష్కరించే వరకు రాజీపడే ప్రసక్తే లేదని, రేపటి నుంచే బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నామని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
బేగంపేట్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద జవహర్ నగర్ డంపింగ్ యార్డు ను తరలించాలని డిమాండ్ చేస్తూ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, ఎన్విరాన్మెంటలిస్టులు దొంతి నరసింహ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎన్ఎఫ్సీ మాజీ డిజిఎం హనుమంత రెడ్డి, ఎస్బిహెచ్ ఫార్మర్ బోర్డ్ డైరెక్టర్ పంపాలా నరసింహ, ఎంఆర్పిఎస్ ప్రతినిధి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎదులాబాద్ నుంచి గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మింగరాజు, రజక సంఘం అధ్యక్షుడు వెంకటేష్, యాంటీ డంప్ యార్డు జేఏసీ కన్వీనర్ డాక్టర్ శంకర్ నారాయణ, కో కన్వీనర్లు మారం సమ్మిరెడ్డి, ఏనుగు సంజీవరెడ్డి, దమ్మైగూడ నుంచి ఓరుగంటి కృష్ణ కిషోర్, ఎదులాబాద్ మాజీ సర్పంచ్, మూసి పరిరక్షణ సమితి అధ్యక్షుడు బట్టి శంకర్, రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఎక్స్పెక్ట్ సుభాష్ రెడ్డి, ఈ డాంప్ యార్డుకి వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లాల తిరుమల్ రెడ్డి, పట్లోళ్ళ విక్రమ్ రెడ్డి, కోర్టులో వాదిస్తున్న అడ్వకేట్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.