ఏదులాపురం/ఖమ్మం, అక్టోబర్ -25(రైట్స్ మీడియా):
ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనితతో కలిసి పర్యటించిన మంత్రి, రూ.38 కోట్లతో మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి, సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులతో పాటు రూ.కోటి వ్యయంతో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.