జగిత్యాల, అక్టోబర్ 25(రైట్స్ మీడియా): పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించి, వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆదివారం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.