ఖమ్మం, అక్టోబర్ -30(రైట్స్ మీడియా):
ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి ఏడులాపురం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఇందులో భాగంగా ఏడులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు సింగరేణి కాలనీ వద్ద రూ. 496 లక్షల అంచనా వ్యయంతో 46 అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణ పనులకు, రూ. 250 లక్షల అంచనా వ్యయంతో ప్రకాశ్ నగర్ బ్రిడ్జి నుండి కోదాడ ఆర్ అండ్ బి రోడ్డు వయా కోటనారాయణపురం ఇందిరమ్మ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ రోడ్లతో సాయి ప్రభాత్ నగర్ వన్ అండ్ టూ, టెంపుల్ సిటీ, అభయ టౌన్షిప్, సింగరేణి కాలనీ, గుర్రాలపాడు తండా, ఇందిరమ్మ కాలనీ, కోట నారాయణపురం, సూర్యా నగర్, చంద్ర నగర్, చిన్న తండా, కె.ఎల్.ఆర్. నగర్, బృందావనం, గోకుల కృష్ణ నగర్, తాశిల్లీ తండా, లక్ష్మీ గాయత్రి నగర్, నందన వనం, ఏడులాపురం, ఆదిత్య టౌన్షిప్, గుర్రాలపాడు ఆర్.టి.సి. కాలనీ, శ్రీవారి నగర్, సత్య సంకల్ప కాలనీ, షాబాద్ మాసరెడ్డి నగర్, వరంగల్ క్రాస్ రోడ్, కోదాడ క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల ప్రజలందరూ నిరంతరం రాకపోకలు సాగిస్తారు.