Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని CHC,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని CHC,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కమలాపూర్ (రైట్స్ మీడియా): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని CHC, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ కి ప్రతిరోజు ఎంతమంది ఓపి సేవల నిమిత్తం వస్తుంటారని, పేషెంట్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా అని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఆరోగ్య కేంద్రంలోని మేల్, ఫిమేల్ వార్డులను, ఓపి నమోదును కలెక్టర్ పరిశీలించారు.

టీకాల గది, మెడికల్ రికార్డు విభాగం, మెడికల్ స్టోర్ ను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది హాజరు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకుని రిజిస్టర్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు.

వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పేషంట్లకు అవసరమైన అన్ని సదుపాయాలు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.మందుల నిర్వహణ సరిగ్గా ఉండాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...