హైదరాబాద్(రైట్స్ మీడియా): క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీ, క్యాన్సర్ రన్‌లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు ఈ రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.