కామారెడ్డి (రైట్స్ మీడియా): కామారెడ్డి రైల్వే స్టేషన్ లో 18 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.. పట్టుకున్న ఎండు గంజాయి విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు తొమ్మిది లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన అశోక్ అనే 26 ఏళ్ల యువకుడు నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో ఒడిస్సా లోని కాంకేర్ అనే ప్రాంతం నుండి సోలాపూర్ తరలిస్తుండగా నమ్మదగ్గ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది నిందితుడిని పట్టుకొన్నట్టు కామారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద్ రెడ్డి తెలిపారు.
నాగవల్లి ఎక్స్ప్రెస్ రైల్లో 18 కిలోల ఎండు గంజాయి రవాణా... పక్కా సమాచారంతో పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..