Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

'సేవా సంకల్ప్ అభియాన్'లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్

• సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో వృద్ధులకు మందులు, నిత్యావసరాల పంపిణీ.

'సేవా సంకల్ప్ అభియాన్'లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్
Share Short Clip Download PDF

• ఆర్.కె. ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు అభినందనలు.

హైదరాబాద్ (రైట్స్ మీడియా):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాపాలన పూర్తి చేసుకున్న శుభసందర్భంగా దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా శనివారం బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ మరియు ఆర్.కె. ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఆర్.కె. ఫౌండేషన్ - హెల్త్‌ కేర్ సెంటర్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వృద్ధులకు, అవసరమైన వారికి మందులు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'సేవా సంకల్ప్ అభియాన్'లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్

ఈ సందర్భంగా గత 20 ఏళ్లుగా శ్రీ బి. రామకృష్ణ ఆర్.కె. ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అక్కడ వృద్ధులకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్య సేవలు మరియు ఇతర ఏర్పాట్లను వారు స్వయంగా పరిశీలించారు.

'సేవా సంకల్ప్ అభియాన్'లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, సీనియర్ నాయకులు బి.ఎన్. శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, దిశా కమిటీ సభ్యులు పరశురామ్, వార్డు అధ్యక్షులు శ్రవణ్, అరుణ్, మరియు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

'సేవా సంకల్ప్ అభియాన్'లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్
'సేవా సంకల్ప్ అభియాన్'లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్