Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

హాస్పిటల్ అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

⏩ ఆదిత్య మెడికేర్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు.

హాస్పిటల్ అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
Share Short Clip Download PDF

⏩ గణపతి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే.

గుంటూరు (రైట్స్ మీడియా): గుంటూరు బుడంపాడులోని ఆదిత్య మెడికేర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

ఆదిత్య మెడికేర్ హాస్పిటల్‌కు గణపతి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, హాస్పిటల్ మరింత అభివృద్ధి చెంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. భక్తితో చేసే పూజకు దైవానుగ్రహం తోడైతే, సేవా భావంతో చేసే అన్నదానం ఎందరో హృదయాల్లో ఆశీర్వాదంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఆదిత్య మెడికేర్ హాస్పిటల్ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి సేవా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

హాస్పిటల్ అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

Source / reference: Journalist Sk. Gouse, Palnadu/Guntur.