నోయిడా(రైట్స్ మీడియా): ఉత్తర ప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్ నిద్రలేని రాత్రులు గడుపుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నోయిడాలో ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. ఆమేఠీలో తయారవుతున్న ఏకే-203 రైఫిళ్లు ఉగ్రవాదులను బెంబేలెత్తిస్తున్నాయని తెలిపారు.
బ్రహ్మోస్ క్షిపణులతో దాయాది పాకిస్థాన్ నిద్రలేని రాత్రులు గడుపుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నోయిడాలో నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభోత్సవంలో కేంద్ర హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు శత్రు స్థావరాలను నాశనం చేశాయని గుర్తుచేశారు. ఉత్తర ప్రదేశ్‌లో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణుల కారణంగా పాకిస్థాన్ భయంతో గడుపుతోందని పేర్కొన్నారు. ఆమేఠీలో తయారవుతున్న ఏకే-203 రైఫిళ్లు మావోయిస్టులు, ఉగ్రవాదులను బెంబేలెత్తిస్తున్నాయని చెప్పారు. 2017 తర్వాత బీజేపీ హయాంలో ఉత్తర ప్రదేశ్ అద్భుత ప్రగతి సాధిస్తోందని వివరించారు.