హనుమకొండ (రైట్స్ మీడియా): పేదరికం కారణంగా ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

​ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామానికి చెందిన చిట్యాల నితిన్ అనే విద్యార్థి కష్టపడి చదివి ప్రతిష్టాత్మకమైన MBBS సీటు సాధించాడు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కళాశాల ఫీజు చెల్లించడం నితిన్ కుటుంబానికి భారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే స్పందించి, విద్యార్థికి అండగా నిలిచారు. ​గతంలో నితిన్ మొదటి సంవత్సరం MBBS ఫీజును స్వయంగా అందజేసిన కడియం శ్రీహరి గారు, తాజాగా రెండో సంవత్సరం చదువు నిమిత్తం రూ. 20,000ల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో విద్యార్థికి నగదును అందజేస్తూ నితిన్ ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

సరైన సమయంలో తమకు అండగా నిలిచి, వరుసగా రెండో ఏడాది కూడా ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి నితిన్ మరియు వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రోత్సాహం తన ఆశయ సాధనకు మరింత ఊతాన్నిచ్చిందని విద్యార్థి నితిన్ సంతోషం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రాజుగారి రఘు, మాజీ సర్పంచ్ చిర్ర కుమార్ స్థానిక నాయకులు, విద్యార్థి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.