Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

అభివృద్ధి పనుల పురోగతితో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న.

అభివృద్ధి పనుల పురోగతితో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
Share Short Clip Download PDF

నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న.

*: కమిషనర్ టి. వెంకన్న*

జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 31(రైట్స్ మీడియా): శనివారం 29వ డివిజన్ రామన్నపేటలోని కమ్యూనిటీ హాల్, 30వ డివిజన్ బాలసముద్రం, 58, 59వ డివిజన్ల పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ, ఇందిరానగర్, ఎక్సైజ్ కాలనీతో పాటు 55వ డివిజన్ భీమారం ప్రాంతాల్లో పర్యటించి నిర్మించిన రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు.

నిర్మాణాల్లో నాణ్యతా లోపాలకు తావులేకుండా, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా పనులు చేపట్టాలని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఈ సందర్బంగా డివిజన్ 29 రామన్నపేటలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి, ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛ ఆటోల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. రహదారులపై చెత్త పేరుకుపోకుండా, చెత్త నిల్వ కేంద్రాలు (గార్బేజ్ పాయింట్లు) ఏర్పడకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు.

అభివృద్ధి పనుల పురోగతితో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.