జగిత్యాల, అక్టోబర్ 21(రైట్స్ మీడియా):
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. బుధవారం పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డేను జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణ లోని పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్,పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.