Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం
Share Short Clip Download PDF

కరీంనగర్(రైట్స్ మీడియా): ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఐఏఎస్, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ పేర్కొన్నారు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అడిషనల్ డీసీపీ వెంకటరమణ విధి నిర్వహణలో దేశవ్యాప్తంగా ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల నామావళిని చదివి వినిపించి, గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ,

దేశవ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. జిల్లా యంత్రాంగానికి పోలీస్ శాఖ వెన్నెముక వంటిదని, శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు, వారి పిల్లల విద్యాభివృద్ధి, సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ,

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ,

దేశ సమగ్రత, అంతర్గత భద్రత, ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాలు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అంకితభావంతో సేవలందించడమే వారికి అందించే నిజమైన నివాళి అని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని పేర్కొన్నారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ,

అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వం వారికి అందాల్సిన నష్టపరిహారాలను పూర్తి స్థాయిలో అందేలా చూస్తామన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు కమిషనరేట్ పరిధిలో రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, వ్యాసరచన, లఘు చిత్రాల పోటీలు, విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొని పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం