Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పర్యటన

విరిగిపడిన చెట్లు, డ్రైనేజీ కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలన

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పర్యటన
Share Short Clip Download PDF

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు | ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన

పల్నాడు/నరసరావుపేట(రైట్స్ మీడియా): మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నరసరావుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వర్షాలు, ఈదురుగాలుల ధాటికి రోడ్లపై విరిగిపడిన భారీ వృక్షాలు, వర్షపు నీటితో నిండిన డ్రైనేజీ కాలువలను పరిశీలించి, సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలగకుండా కూలిపోయిన చెట్లు, కొమ్మలను వెంటనే తొలగించాలని పురపాలక అధికారులను ఆదేశించారు. నీరు నిలిచిపోయే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అలాగే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. చేపట్టిన సహాయక చర్యల పురోగతిని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,

తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పురపాలక, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,

Source / reference: Bureau Chief Sk. Gouse, Palnadu District.