Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు అమరులకు ఘన నివాళి..

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్
Share Short Clip Download PDF

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు అమరులకు ఘన నివాళి..

హనుమకొండ (రైట్స్ మీడియా): అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లోని అమరుల స్తూపం వద్ద హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు మరియు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ పోలీసు అమరులను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ రక్షణ కోసం, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్, అమరవీరుల కుటుంబ సభ్యులు,అధికారులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా, వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరమరణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ధైర్యం, కర్తవ్యనిష్ఠ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధినిర్వహణలో ఇప్పటివరకు 25 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులయ్యారని. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమరులైన పోలీసుల త్యాగాలు ఎప్పటికీ మరచిపోలేనివని, వారి సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా, వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,

ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు గౌరవాభివందనాలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అమరుల కుటుంబ సభ్యులతో కలిసి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు, అమరుల కుటుంబాల సంక్షేమం కోసం పోలీస్ శాఖ కట్టుబడి ఉన్నదని కమిషనర్ గారు తెలిపారు, ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సిపి అమరుల కుటుంబాలకు గిఫ్టులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, అడిషనల్ డిసిపి పరిపాలన రాయల ప్రభాకర్ రావు, మిగతా అడిషనల్ డిసిపిలు బాలస్వామి, సురేష్, శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్ ఎస్‌ఐలు పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్