Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులతో కలిసి ర్యాలీలో పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Share Short Clip Download PDF

పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులతో కలిసి ర్యాలీలో పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

హనుమకొండ (రైట్స్ మీడియా): పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు హనుమకొండలో నిర్వహించిన పోలీసు ర్యాలీలో పాల్గొని పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.హనుమకొండ చౌరస్తా నుంచి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. విధి నిర్వహణలో భాగంగా దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

అనంతరం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. దేశ శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. పోలీసు విధి అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేయాల్సిన బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన వీరుల ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలకు గౌరవం చాటారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు