ఖమ్మం, అక్టోబర్-21 (రైట్స్ మీడియా): పోలీసుల త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భరోసా, రక్షణ కల్పించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ అన్నారు.
బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్మృతి పరేడ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్తో కలిసి పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్స్‌లోని పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్, పోలీస్ కమీషనర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులను స్మరించుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.