Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఎల్ నినో ప్రభావం పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి

గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన..

ఎల్ నినో ప్రభావం పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి
Share Short Clip Download PDF

గిరిజన బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శంకుస్థాపన..

*ప్రచురణార్థం*

ఖమ్మం, అక్టోబర్ -19(రైట్స్ మీడియా):
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ (22వ వార్డు)లో రూ. 2.5 కోట్లతో నిర్మించే గిరిజన సంక్షేమ శాఖ బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవన నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి సోమవారం రాత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

త్వరలోనే బాలికల హాస్టల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు.

వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర పరిణామాలతో రాష్ట్రంలో ఎల్నినో ముప్పు పొంచి ఉందని, సాగునీటికి కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్పటికే రైతులు వేసిన పంటకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వరి, మొక్కజొన్న వంటి నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు సాగుచేయవద్దని, నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగుచేయాలని అన్నారు. ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఎదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.