హనుమకొండ (రైట్స్ మీడియా): కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి పట్టభద్రులు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎండి అయూబ్ తదితరులు పాల్గొన్నారు.