Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో లబ్ధిదారులకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Share Short Clip Download PDF

తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో లబ్ధిదారులకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ , సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం/తిరుమలాయపాలెం, నవంబర్- 03(రైట్స్ మీడియా): పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్ళని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలోని శ్రీ సాయి గణేష్ ఫంక్షన్ హాల్లో 2 వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

తిరుమలాయపాలెం మండలంలో రెండో విడత క్రింద 187 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచితంగా రూ.5 లక్షల ఆర్థిక సాయంతో ఇల్లు కట్టించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

తిరుమలాయపాలెం మండలంలో మొదటి విడతలో 810 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు దాదాపు 700 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. రెండో విడత కింద ఇళ్లను అందజేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది విడతలతో ముగిసేది కాదని, అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు అందేవరకు నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  కుల, మత, రాజకీయ పార్టీల వ్యత్యాసాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామన్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలనే నిరుపేద ఆడబిడ్డల చిరకాల కోరికను నెరవేర్చడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. 

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించామన్నారు. డ్వాక్రా మహిళలకు 73 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించామన్నారు. 74 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, 14 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని మంత్రి అన్నారు.

ఏది ఏమైనా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముందు, నేటి ప్రతిపక్ష నాయకుడు రెండు సంవత్సరాలలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాబోతున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందో, దేశవ్యాప్తంగా కూడా ఇందిరమ్మ రాజ్యం అలాగే ఉంటుందని, ఏవైతే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామో, కేంద్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇదే తరహాలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ,

తిరుమలాయపాలెం మండలంలో మొదటి విడతలో భాగంగా దాదాపు 810 ఇళ్లు మంజూరు చేయబడ్డాయని, ఇందులో 600 ఇళ్లు పూర్తిగా పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా పూర్తి చేసుకున్నారన్నారు. మరో 100 ఇళ్లు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని, వీటిలో స్లాబ్ వేసిన ఇళ్లు 60 వరకు ఉండగా, ఇటీవల కొత్తగా సాంక్షన్ రావడం వలన త్వరలో పనులు ప్రారంభించనున్న మరో 90 ఇళ్లు ఉన్నాయని తెలిపారు.

రెండవ విడతలో భాగంగా అదనంగా మరో 185 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని కలెక్టర్ అన్నారు. ఈ పథకం కింద పూర్తిగా అర్హత ఉన్న నిజమైన పేదలను మాత్రమే పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారు ఇళ్లు కట్టుకుంటున్న దశలను బట్టి ఫోటో తీస్తే చాలు, నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా పారదర్శకమైన విధానం అమలవుతోందని అన్నారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో నమ్మకం, డిమాండ్ మరింత పెరిగిందని తెలిపారు. కొత్తగా మంజూరైన ఇళ్ల లబ్ధిదారులు కూడా త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.

అనంతరం మంత్రి తిరుమలాయపాలెం మండలం ఏలువారిగూడెం గ్రామంలో ఎన్. నగేష్ - మంగమ్మ లు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు.

ఏలువారిగూడెం గ్రామంలో తెట్టెంపాడు-బీరోలు రోడ్డు నుండి ఏలువారిగూడెం వరకు రూ. 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, బీరోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ. 48 లక్షలతో నిర్మిస్తున్న ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్ రెడ్డి, పిఆర్ ఎస్ఈ జి. వెంకట్ రెడ్డి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, మండల ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్ లు వినోద, గుగులోతు తులసి నర్సింహ, గుమ్మడి దేవభిక్షం, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.