Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో పట్టభద్రులు, అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
Share Short Clip Download PDF

కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో పట్టభద్రులు, అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.

హనుమకొండ(రైట్స్ మీడియా): నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు మరియు పట్టభద్రులైన విద్యార్థులతో భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధులుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ తెలుగు అకాడమి ఛైర్మన్ ప్రొ.వెంకట నారాయణ, లైబ్రరీ ఛైర్మన్ ఎండి అజీజ్ ఖాన్ మరియు వరంగల్ డిసిసి అధ్యక్షులు ఎండి అయూబ్ పాల్గొన్నారు.

సమావేశంలో హనుమకొండ జిల్లా DCC అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ

కాకతీయ విశ్వవిద్యాలయ యువజన విభాగం పట్టభద్రులను, మేధావులను ఏకం చేస్తూ ఇంతటి అద్భుతమైన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఒక ఉన్నత విద్యావంతుడు, నాలుగు తరాలుగా కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం నిలబడిన ఒక ప్రతిష్టాత్మక రాజకీయ కుటుంబ వారసుడైన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ని అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ప్రజాబలం ఉంది. గత 2024 ఉపఎన్నికల సమయంలో ఓటర్ల నమోదు ఒక ఎత్తు అయితే, ప్రస్తుత ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ (ఫామ్-18) ముగింపు దశకు వచ్చేసరికి నల్గొండ-ఖమ్మం-వరంగల్ 3 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 4.58 లక్షలకు పైగా పట్టభద్రులు ఓట్లు నమోదు చేసుకున్నారు. కేవలం హనుమకొండ జిల్లా నుంచే 43,997 మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు కావడం ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల కష్టానికి నిదర్శనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ స్థానం నుండి నాయిని రాజేందర్ రెడ్డి ని గెలిపించి పట్టభద్రులు కాంగ్రెస్ వైపు నిలిచారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలకు గాను 32 స్థానాల్లో కాంగ్రెస్ శాసనసభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తిరుగులేని బలంతో, పట్టభద్రులైన యువత, న్యాయవాదులు, అధ్యాపక లోకం అంతా ఏకతాటిపైకి వచ్చి సర్వోత్తమ్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను" అని పిలుపునిచ్చారు.

సమావేశంలో హనుమకొండ జిల్లా DCC అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు మాట్లాడుతూ

ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ*

కాకతీయ విశ్వవిద్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో ఇంతటి భారీ ఎత్తున ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, నన్ను ఆశీర్వదించడానికి మేధావులను, ప్రొఫెసర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో, ఇక్కడి ప్రజలతో నాలుగు తరాల అనుబంధం ఉంది. నా తండ్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా ప్రజలకు చేసిన సేవలే నాకు మార్గదర్శకం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి, అమెరికా లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఒక విద్యావంతుడిగా, యువజన కాంగ్రెస్ నుండి నేటి వరకు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక కార్యకర్తగా పట్టభద్రులు, నిరుద్యోగ యువత మరియు ఉద్యోగుల సమస్యలపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది. అధిష్ఠానం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ అందరి ఆశీస్సులతో శాసనమండలికి ప్రాతినిధ్యం వహించి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

ప్రస్తుతం మన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను అందుబాటులోకి తేవడానికి, యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేలా 'కే-హబ్' ద్వారా స్టార్టప్, ఆవిష్కరణల హబ్‌గా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు వర్సిటీ నిధుల కొరతను తీర్చడానికి గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద భారీగా బడ్జెట్ కేటాయింపులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.

రాష్ట్రంలో మన ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు, విద్యా రంగ సంస్కరణలు వేగవంతంగా చేస్తోంది. శాసనమండలిలో విద్యావంతుల, ఉద్యోగుల గొంతుకగా నిలబడి, కాకతీయ యూనివర్సిటీ సమస్యలను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంపూర్ణ న్యాయం చేయడమే నా ధ్యేయం. నాపై నమ్మకంతో అధిష్ఠానం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ అందరి ఆశీస్సులతో శాసనమండలికి ప్రాతినిధ్యం వహించి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ*
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి: డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి