రూ.6.65 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ప్రారంభించడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ చెక్‌డ్యామ్‌తో కట్టుకాచారం, కొత్తగూడెం, పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కట్టుకాచారం పీపీవీ నుంచి బట్టుకుంటవాగు వరకు రూ.2.50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు.
రాయగూడెం నుంచి తక్కెళ్లపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు, కట్టుకాచారం గ్రామ అంతర్గత రోడ్లకు రూ.52 లక్షలు, విద్యుత్ లైన్ల మార్పిడికి రూ.7.50 లక్షలు, తాగునీటి వసతుల కోసం రూ.3.50 లక్షలు, అంగన్వాడీ భవనం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కట్టుకాచారం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో సుమారు రూ.13.50 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతోందని మంత్రి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుకాచారం వద్ద చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తవడం రైతులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. చెక్ డ్యామ్ వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి లభ్యత మెరుగుపడు తుందని అన్నారు. చెక్‌డ్యామ్ నిర్మాణంతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా తాగునీటి సమస్య కూడా ఏర్పడుతోందని, ఎల్‌నినో ప్రభావంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎదురవు తున్నాయని మంత్రి తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కూడా సవాలుగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు.
తెలంగాణను ప్రపంచంలోని అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ పడేలా ముందుకు తీసుకెళ్లేందుకు విద్యుత్ ఎంతో అవసరమని మంత్రి అన్నారు. సౌర, తదితర ప్రత్యామ్నాయ వనరుల నుంచి విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను వారి ఇంటి వద్దకే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.