మహబూబాబాద్ (రైట్స్ మీడియా): మహబూబాబాద్ జిల్లాలోని మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళలకు అవసరమైన సహాయాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా సక్షేమ శాఖ కార్యాలయంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లాలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
ఈ సందర్భంగా ఇంచార్జ్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష మాట్లాడుతూ
జిల్లాలోని ప్రతి ప్రాజెక్టుకు 5 గొడుగుల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, సంబంధిత అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.