Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పండుగ సాయన్న ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

పండుగ సాయన్న ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
Share Short Clip Download PDF

పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం: టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ (రైట్స్ మీడియా): పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వీరుడు, తెలంగాణ గడ్డపై ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..

నిజాం పాలనలో దొరలు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా పండుగ సాయన్న సాగించిన పోరాటం అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని నింపిందని పేర్కొన్నారు. సామాజిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన ఆయన సాహసం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..

పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, పేదలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు.

పండుగ సాయన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, పేదల సంక్షేమం కోసం మరింత బలంగా పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ చైర్మన్ తాహెర్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.