జిడబ్ల్యూఎంసీ(రైట్స్ మీడియా): పారిశుద్ధ్య కార్మికుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని జిడబ్ల్యూఎంసీ స్పెషల్ ఆఫీసర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు.
గురువారం జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కమిషనర్ టి. వెంకన్నతో కలసి పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, అప్రాన్లు, బూట్లు, గ్లౌజులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా యూనిఫార్మ్‌తో పాటు అప్రాన్ ధరించాలని, బూట్లు, గ్లౌజులు ఉపయోగించాలని సూచించారు. కార్మికుల ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతను కాపాడటంలో రక్షణ పరికరాలు కీలకమని పేర్కొంటూ, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వినియోగించాలని తెలిపారు.