Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి స్ఫూర్తిదాయకం...

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జ్యోతి.

వీర వనిత చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి స్ఫూర్తిదాయకం...
Share Short Clip Download PDF

వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి స్ఫూర్తిదాయకమని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి అన్నారు. స్థానిక వైరా రోడ్డులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద గురువారం జిల్లా వెనక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి మాట్లాడుతూ

సమాజంలోని అసమానత్వానికి ఎదురొడ్డి నిర్భయంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని, జమీందార్ల పాలనలో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అనేక సంఘాలలో ఆమె స్పూర్తి నింపారని అన్నారు. చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలిగా, భూ, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమతో వీర వనితగా చరిత్రలో నిలిచి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.

సమాజహితం కొరకు పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. చాకలి ఐలమ్మ కు గుర్తింపు అందించడంలో భాగంగా కోఠిలోని మహిళ యూనివర్సిటీకి ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముదిగొండ సొసైటీ చైర్మన్ ఎలగొండ స్వామి, రజక కులసంఘ నాయకులు, బిసి కుల సంఘ నాయకులు జక్కుల వెంకటరమణ, తమ్మరపు బ్రహ్మం, మాచర్ల యెలాద్రి, కోడి లింగయ్య, నట్టు వెంకటేశ్వర్లు, కత్తి నెహ్రూగౌడ్, మునిగ కోటేశ్వరరావు, ఎల్లురి విజయ్ కుమార్, ఎస్ కే సయ్యద్ బాషా, వల్లపు సోమరాజు, అప్పారావు, ఉపేందర్, పడిగల కృష్ణవేణి, రమాదేవి, బాబురావు, సత్యనారాయణ, హనుమంతు రావు, వెంకన్న, రమణ కుమార్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారులు, ఖమ్మం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయం సిబ్బంది, వసతిగృహ సంక్షేమ అధికారులు, రజక సంఘ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.