జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గురువారం నగరంలోని శక్తి సదన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కలెక్టర్ శక్తి సదన్ లోని వసతులను పరిశీలించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న ఇన్‌మేట్స్ తో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శక్తి సదన్ లో నిర్వహిస్తున్న అడ్మిషన్స్ రిజిస్టర్,స్టాఫ్ రిజిస్టర్, ఇన్‌మేట్స్ అటెండెన్స్ రిజిస్టర్, ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గృహ్ లో అందిస్తున్న కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్ శిక్షణ వంటి వృత్తి విద్యా కోర్సుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇన్‌మేట్స్ కు అందిస్తున్న భోజన మెనూ గురించి, తాగునీరు ఎక్కడి నుండి అందిస్తున్నారు, నాణ్యత ఎలా ఉంది అనే విషయాలపై సిబ్బందిని ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఇన్‌మేట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి...అందరూ తమ చదువులను పూర్తి చేసుకోవాలని, చదువు పూర్తయిన తర్వాత వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించి, వారు స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎమ్. విశ్వజా, ఈ.వో. ఆశాదేవి,శక్తి సదాన్ సూపరింటెండెంట్ శైలజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.