కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి తెలిపారు.
గురువారం ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో వెంకటాపూర్ మండలం జవహర్‌నగర్ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయ తరగతుల్లో ప్రవేశాల కోసం లక్కీ డ్రా నిర్వహించారు.