Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

జనగణనను పకడ్బందీ ప్రణాళికతో విజయవంతం చేయాలి

అధికారులు బాధ్యతంగా వ్యవహరించాలి:జిల్లా కలెక్టర్ & ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ చాహత్ బాజ్‌పాయ్

జనగణనను పకడ్బందీ ప్రణాళికతో విజయవంతం చేయాలి
Share Short Clip Download PDF

జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 22(రైట్స్ మీడియా): జనగణన–2027లో భాగంగా చేపట్టనున్న జనాభా గణనను ఖచ్చితత్వంతో, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని
జిల్లా కలెక్టర్ & ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు.

గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో హన్మకొండ జిల్లా, జిడబ్ల్యూ ఎంసి లోని జిల్లా స్థాయి అధికారులు, ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులకు ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,

జనగణన మొదటి దశలో హౌస్ లిస్టింగ్, హౌస్ బ్లాకింగ్, సంబంధిత డేటా ఎంట్రీ ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. తదుపరి కీలకమైన జనాభా గణన దశను దృష్టిలో ఉంచుకుని ఎన్యూమరేషన్ బ్లాక్‌లను సమీక్షించి, అవసరమైన సవరణలను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల సంఖ్య, సిబ్బంది పనిభారాన్ని అంచనా వేసి సమానంగా విధులు కేటాయించాలన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల ఎంపికలో చురుకుదనానికి ప్రాధాన్యమిస్తూ, అర్హులైన యువత, ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న ఇతర సిబ్బందిని నిబంధనల ప్రకారం వినియోగించుకోవాలని తెలిపారు. విద్యాసంస్థల బోధనకు ఆటంకం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఛార్జ్ అధికారులు టెక్నికల్ అసిస్టెంట్లు, ఛార్జ్ క్లర్కులపైనే పూర్తిగా ఆధారపడకుండా, వారి పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ తప్పులు జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. శిక్షణలో సందేహాలను నివృత్తి చేసుకుని, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ శిక్షణ శిబిరంలో హైదరాబాద్ జనగణన విభాగ శిక్షకులు సతీష్, ప్రశాంత్ జన గణనకు సంబంధించిన విధి విధానాలను గురించి వివరించి సందేశాలను నివృత్తి చేశారు.

జనగణనతో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా అధికారులు పూర్తి బాధ్యతతో, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, జెడ్పి సీఈఓ శేషాద్రి, సీపీఓ సత్యనారాయణ రెడ్డి, అదనపు కమిషనర్ జోనా, సీపీ రవీందర్ రాడెకర్, జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓ వెంకటేష్,ఛార్జ్ అధికారులు, అదనపు ఛార్జ్ అధికారులు తదితరుల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,