జయశంకర్ భూపాలపల్లి(రైట్స్ మీడియా): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే గండ్ర
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై దిశా నిర్దేశం..
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై దిశా నిర్దేశం..
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, తమ పరిధిలోని ప్రతి గ్రాడ్యుయేట్‌ను వ్యక్తిగతంగా కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.
అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకునేలా కృషి చేయాలని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేలా చొరవ చూపాలని కోరారు. ఈ ప్రక్రియను బాధ్యతగా నిర్వహిస్తూ, ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.