హైదరాబాద్/హనుమకొండ (రైట్స్ మీడియా): తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగ నియామకాల కోసం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం హైదరాబాద్ నుండి అక్టోబర్ 24, 26 తేదీల్లో నిర్వహించనున్న టీజీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, అభ్యర్థుల తనిఖీలు, సాంకేతిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా, ఇతర మౌళిక వసతులపై టీజీపీఎస్సీ చైర్మన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.