Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు..

రంగలీల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్

దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు..
Share Short Clip Download PDF

రంగలీల మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్

జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 19(రైట్స్ మీడియా):
వరంగల్‌లోని రంగలీల మైదానంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాల ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసు బందోబస్తు వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రావణాసుర వధ కార్యక్రమం సందర్భంగా అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు..

అన్ని శాఖల అధికారులు, దసరా ఉత్సవ కమిటీ సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా విజయవంతం చేయాలని కోరారు.