Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధిని కాపాడాలి: ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి

స్వచ్ఛ ఆటో కార్మికుల ఉపాధిని కాపాడాలి: ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి
Share Short Clip Download PDF

రాష్ట్రంలో స్వచ్ఛ ఆటో కార్మికుల జీవనోపాధికి ముప్పు వాటిల్లేలా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో కార్మికులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌ ని కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..

ఎన్నో ఏళ్లుగా చెత్త సేకరణే ప్రధాన వృత్తిగా ఎంచుకుని, స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ మరియు రవాణా బాధ్యతలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తుండటంతో తమ పొట్ట కొట్టినట్లవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల రాకతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు వాపోయారు.

కార్మికుల ఆవేదనను సానుకూలంగా స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్.. వారి సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. స్వచ్ఛ ఆటో కార్మికుల హక్కులను, వారి ఉపాధిని పరిరక్షించేందుకు తాను కార్మికుల తరఫున ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.

"కార్మికుల ఉపాధిని కాపాడాలి — స్వచ్ఛ ఆటో కార్మికులకు పూర్తి న్యాయం చేయాలి" అనే నినాదంతో ఈ కార్యక్రమంలో కార్మికులు తమ నిరసనను గట్టిగా వినిపించారు.