*Press Release*
*నైపుణ్య కార్యక్రమాల సమర్థ అమలు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి*
*నైపుణ్య విభాగం కింద ఇప్పటివరకు 5.43 లక్షల మందికి ఉద్యోగాల కల్పన*
*పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ సమర్థ వినియోగానికి ఆదేశం*
*సీడాప్ ద్వారా ఏడాదికి లక్షమంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం*
*నైపుణ్యాభివృద్ధి విభాగంపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఆదేశం*
అమరావతి(రైట్స్ మీడియా): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున చేపడుతున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాల సమర్థ అమలు ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి విభాగం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా యువతకు ఏపీఎస్ఎస్ డీసీ ద్వారా చేపడుతున్న వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుతీరు, ప్రగతిని అధికారులు వివరించారు. పీఎం కౌశల్ వికాస్ యోజన పథకం వినియోగంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీ రెండోస్థానంలో నిలిచిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 పీఎంకేవీవై సెంటర్స్ అప్ గ్రేడ్ కు సమావేశంలో నిర్ణయించారు. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన విషయంలో స్వలకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి నిర్దేశించారు. పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ సమర్థ వినియోగంపైనా మంత్రి సమీక్షించారు. నిరుద్యోగులకు పెద్దఎత్తున ప్రయోజనం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.