కాకతీయ యూనివర్సిటీ లోని కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్‌ లో భాగంగా బుధవారం లియో క్లబ్ (Leo Club) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఏ విధంగా సైబర్ నేరాలకు బలైపోతున్నారో ఏసీపీ, సీఐ మరియు వారి బృందం వివరంగా వివరించారు. ఆన్‌లైన్ సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రక్షణ చర్యలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ (ACP) వెంకటరమణ, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ (CI) రవి కుమార్, సైబర్ సెక్యూరిటీ ఎస్ఐ (SI) శ్రావణి, ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు లియో క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు.