“కాంపస్ వదిలి వెళ్ళే లోపు జాబ్ సంపాదించాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి” అని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ 50వ వ్యవస్థాపక దినోత్సవం, స్వర్ణోత్సవ వేడుకలు సందర్భంగా విశ్వవిద్యాలయ డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్టడీస్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ అద్యక్షతన బుధవారం మద్యహ్నం విశ్వవిద్యాలయ సెనెట్ హాల్‌లో “Free coaching for competitive exams, SI and Police Constable” ప్రారంభ కార్యక్రమం లో ముఖ్య అతిదిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎటువంటి కష్టాలు వచ్చిన ముందుకు పోవాలి అని, విశ్వవిద్యాలయ విద్యార్థులకు అన్ని పోటి పరిక్షలకు సిద్దం చేయాలి అన్నారు. అందుకు కావాల్సిన వసుతులు, అనుమతులు మంజూరు చేస్తాం అన్నారు. నేటి పోటి ప్రపంచం ప్రతి నిమిషం, ప్రతి మార్క్ చాల విలువైనది అన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మాట్లాడుతూ కష్టపడే తత్త్వం, ఆత్మ విశ్వాసం తో లక్ష్య సాదన చేయాలి అని అన్నారు. కాంపస్ కాలేజీ ఆచార్య టి. మనోహర్, కామర్స్ అండ్ బిజినెస్ మానేజ్మెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. నరసింహ చారి, జాతీయ సేవా పధకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆచార్య ఈసం నారాయణ పాల్గొన్నారు. మొత్తం 600 మంది పోటి పరిక్షల శిక్షణ కు దరఖాస్తు చేసుకునట్టు, ప్రతి రోజు సాయంత్రం 2.00 గంటల నుంచి 6.00 గంటల మధ్య తరగతలు జరుగుతాయి అని వెల్లడించారు.
విద్యార్థులు ఉన్నత లక్షాలను ఎంచుకోవాలి: కాకతీయ యూనివర్సిటీ వీ.సి. ప్రతాప్ రెడ్డి