కాకతీయ యూనివర్సిటీ లోని కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇండక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా బుధవారం లియో క్లబ్ (Leo Club) ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఏ విధంగా సైబర్ నేరాలకు బలైపోతున్నారో ఏసీపీ, సీఐ మరియు వారి బృందం వివరంగా వివరించారు. ఆన్లైన్ సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రక్షణ చర్యలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ (ACP) వెంకటరమణ, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ (CI) రవి కుమార్, సైబర్ సెక్యూరిటీ ఎస్ఐ (SI) శ్రావణి, ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు లియో క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
విద్యార్థులు సైబర్ నేరాల బారినపడొద్దు: ఏసీపీ వెంకటరమణ
News URL: https://rightsmedia.in/news/students-should-not-fall-prey-to-cybercrimes-acp-venkataramana