కొత్తగూడెం (రైట్స్ మీడియా): పట్టణంలోని రైటర్ బస్తీలో కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్నతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అతి త్వరలో నిర్మాణ పనులు చేపడతామని, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపాలరావు, ఆళ్ల మురళి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.