Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అగ్రిస్టాక్ కమిటీ ద్వారా రైతులకు వేగవంతమైన సేవలు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో అగ్రిస్టాక్ జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కోసం వ్యవసాయ, భూములు కొలతలు, పశు సంవర్ధక, ఉద్యాన, సహకార, నాబార్డ్, పౌర సరఫరాలు, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమావేశం

అగ్రిస్టాక్ కమిటీ ద్వారా రైతులకు వేగవంతమైన సేవలు
Share Short Clip Download PDF

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో అగ్రిస్టాక్ జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కోసం వ్యవసాయ, భూములు కొలతలు, పశు సంవర్ధక, ఉద్యాన, సహకార, నాబార్డ్, పౌర సరఫరాలు, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమావేశం

హనుమకొండ (రైట్స్ మీడియా): జిల్లాలో అగ్రిస్టాక్ కమిటీ ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించేందుకు ఈ నూతన టెక్నాలజీ ఉపయోగపడుతుందని
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలు లో అగ్రి స్టాక్ టెక్నాలజీ విధానంపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు కోసం వ్యవసాయ, భూములు కొలతలు, పశు సంవర్ధక, ఉద్యాన, సహకార, నాబార్డ్, పౌర సరఫరాలు, తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఛైర్ పర్సన్ గా, కన్వీనర్ గా జిల్లా వ్యవసాయ అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటయింది.

ఈ సమావేశంలో నూతన టెక్నాలజీ అగ్రిస్టాక్ ద్వారా రైతులకు నాణ్యమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు, పథకాలను అందించేందుకు నూతన టెక్నాలజీని తీసుకురావడానికి, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో మార్పులు తెచ్చేందుకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, బ్యాంకు సేవలు, మార్కెటింగ్ సదుపాయాలు, పంట కొనుగోలును ఒకేతాటిపైకి తీసుకువచ్చి రైతులకు వేగవంతమైన సేవలను అందించడం అగ్రి స్టాక్ టెక్నాలజీ ప్రధాన ఉద్దేశమని అధికారులకు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ

వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి రైతులకు వేగవంతమైన సేవలను అందించేందుకు జిల్లాస్థాయి అగ్రి స్టాక్ కమిటీ పనిచేస్తుందని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, భూములు కొలతలు శాఖ ఏడీ నూర్ సింగ్, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాధా కిషన్, ఉద్యాన శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి మోహన్, అడిషనల్ డీఆర్డీవో వెంకటేశ్వర్లు, సీపీవో సత్యనారాయణ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, ఎల్డీఎం విష్ణుప్రియ, ఇతర అధికారులు పాల్గొన్నారు.