Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ఉద్యోగ విరమణ సహజమే.. సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయం: కమిషనర్ టి. వెంకన్న

పదవీ విరమణ పొందిన అదనపు కమిషనర్ జోనా, పారిశుద్ధ్య కార్మికుడు కుమార్‌లకు ఘన సన్మానం

ఉద్యోగ విరమణ సహజమే.. సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయం: కమిషనర్ టి. వెంకన్న
Share Short Clip Download PDF

పదవీ విరమణ పొందిన అదనపు కమిషనర్ జోనా, పారిశుద్ధ్య కార్మికుడు కుమార్‌లకు ఘన సన్మానం

జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 31(రైట్స్ మీడియా): ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, అయితే విధి నిర్వహణలో అంకితభావంతో అందించిన సేవలు, సంస్థ అభివృద్ధికి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అన్నారు.

శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో పదవీ విరమణ పొందిన అదనపు కమిషనర్ ఇసాంపల్లి జోనా, పారిశుద్ధ్య కార్మికుడు కుమార్‌లకు జిడబ్ల్యూ ఎంసి, జె ఏ సి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్, అధికారులు, సిబ్బంది వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ,

మున్సిపల్ శాఖలో వివిధ హోదాల్లో సుమారు 44 సంవత్సరాల పాటు సేవలందించిన జోనా అనుభవం, అంకితభావం అభినందనీయమన్నారు. ఉద్యోగ జీవితంలో ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నత స్థాయికి ఎదగడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సేవలు కూడా నగర ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రతకు ఎంతో కీలకమని, ప్రతి ఉద్యోగి కృషి సంస్థకు విలువైనదేనని అన్నారు.

ఉద్యోగ విరమణ అనేది బాధ్యతల నుంచి విరామమే తప్ప, జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభమని పేర్కొంటూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో గడపాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

అనంతరం కమిషనర్ మాట్లాడుతూ,

ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్ రెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్ రావు, ఉప కమిషనర్లు సమ్మయ్య, బిర్రు శ్రీను, ప్రసన్న రాణి, జేఏసి సభ్యులు బాకం సంతోష్, సర్జన రాజు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ విరమణ సహజమే.. సంస్థకు అందించిన సేవలు చిరస్మరణీయం: కమిషనర్ టి. వెంకన్న