GWMC, అక్టోబర్12(రైట్స్ మీడియా): ప్రజావాణి దరఖాస్తులను వేగవంతం గా పరిష్కరించాలని బల్దియా అదనపు కమిషనర్ జోనా అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వింగ్ అధికారులతో కలసి ప్రజల నుంచి 73 దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి సంబంధిత విభాగాలకు అప్పగించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి దరఖాస్తులను వేగవంతం గా పరిష్కరించాలి: అదనపు కమిషనర్ జోనా
వివిధ విభాగాల వారీగా స్వీకరించిన దరఖాస్తులు:
- టౌన్ ప్లానింగ్: 35
- ఇంజినీరింగ్: 22
- ఆరోగ్యం, పారిశుద్ధ్యం: 06
- రెవెన్యూ: 06
- నీటి సరఫరా: 04
మొత్తం 73 దరఖాస్తులు
ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, డీఎఫ్‌ఓ శంకర్‌లింగం, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.