Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

గ్రీవిన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

గ్రీవిన్స్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్
Share Short Clip Download PDF

మహబూబాబాద్(రైట్స్ మీడియా): ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తు లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్, డి.ఆర్.ఓ నాగలక్ష్మి లతోకలిసి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ

పలు సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల యొక్క దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అన్నారు. ఈ రోజు వచ్చిన దరఖాస్తులలో మహబూబాబాద్ లోని గుమ్ముడూరు ప్రాంతానికి చెందిన అవారి నిర్మల సర్వే నెంబర్.36/A లో గల ఒక ఎకరం 19 గుంటల భూమి నిషేధిత జాబితా నుండి పట్టా భూమి మార్చి పట్టా ఇప్పించగలరని కోరారు. కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన దేసంగి మహాలక్ష్మి తాను గత 20 సంవత్సరాలుగా రేకుల ఇంట్లో నివాసిస్తున్నానని, ఇంతవరకు సరైన నివాస గృహం లేదని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని కోరారు.

కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన పురుషోత్తం రెడ్డి గ్రామ పంచాయతీ వారు గ్రామ రోడ్డు విస్తరణ లో భాగంగా తన ఇంటి ప్రహారీ గోడకు 3 ఫీట్ల రోడ్డు వెడల్పు కోసం నోటీసులు ఇచ్చి అక్రమంగా 12 ఫీట్ల వరకు తన స్థలoలోకి వచ్చి దౌర్జన్యంగా రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారని తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి జిల్లా కేంద్రంలో( 119 ), డివిజనల్ కేంద్రంలో(03) మండలాలలో(81) మొత్తంగా (203) దరఖాస్తులను పరిష్కారినికై సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూధనరాజు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ కుమార్, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి రవిరాథోడ్, జిల్లా న్యాయ సలహా పశుసంవర్ధక శాఖ అధికారి కిరణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీరాం, ఇంచార్జ్ డి.ఈ.ఓ మందుల శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి రేవంత్, సివిల్ సప్లై అధికారి రమేష్, పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పలు విభాగాల సూపరింటెండెంట్ లు, భూభారతి జిల్లా కో ఆర్డినేటర్ సురేష్, ఈ.డి.ఎం యుగేందర్, సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.