ఖమ్మం, అక్టోబర్-12(రైట్స్ మీడియా): ఖమ్మం ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం శుభసూచకమని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని కొత్తగూడెం అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్ లతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించగా, పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., కొత్తగూడెం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివ రావు, మట్టా రాగమయి దయానంద్, టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ. శరత్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, తదితరులు పాల్గొన్నారు.