ఉదయగిరి (రైట్స్ మీడియా): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపల్లెలో నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రూ. 11,085 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. సభ ముగిసిన అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంలు కాకొల్లువారిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పూలవర్షంతో ఘన స్వాగతం పలకగా, సీఎం, డిప్యూటీ సీఎం కాలినడకన గ్రామంలో నడుస్తూ పల్లె పండుగ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.
ఉదయగిరిలో ఘనంగా ‘పల్లె పండుగ 3.0’: రూ.11,085 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఉదయగిరి సభలో ముఖ్యమంత్రి ప్రసంగ ముఖ్యాంశాలు:
➤ గ్రామీణ వికాసం – సంక్షేమం: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే ధ్యేయంగా గోకులం షెడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, చెత్త నుంచి సంపద సృష్టించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రకు నాందీ గ్రామాలేనని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు, స్థలం, విద్యుత్, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని తెలిపారు.
➤ఆర్థిక పరిస్థితి – సూపర్ సిక్స్ పథకాలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ. 10 లక్షల కోట్ల అప్పుల భారం వారసత్వంగా వచ్చిందని, ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీని ఆదుకున్నారన్నారు.
➤ ప్రజా సంక్షేమ పథకాలు: సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలన ఎన్డీఏ మంత్రమని సీఎం చెప్పారు. ‘తల్లికి వందనం’ కింద ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ‘స్త్రీ శక్తి’, ప్రతి నెలా 1వ తేదీన క్రమం తప్పకుండా సామాజిక పింఛన్లు, అన్నదాత సుఖీభవ, రూ. 5లకే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మత్స్యకారులు, నేతన్నలు, ఆటో డ్రైవర్ల సేవలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అమూల్ బ్రాండ్‌కు సమానంగా 'స్వయం' బ్రాండ్‌ను అభివృద్ధి చేస్తూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
➤పారిశ్రామికాభివృద్ధి – ప్రాజెక్టులు: గత పాలకులు దెబ్బతీసిన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించి, 'ఈజ్ ఆఫ్ డూయింగ్' నుంచి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంలోకి వచ్చామని తెలిపారు. 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును తానే ప్రారంభించానని, వెలిగొండ ఫేజ్-2 కూడా పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గానికి నీళ్లు తెచ్చి, మార్కాపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. హంద్రీ-నీవా, పోలవరం ఎడమ కాలువ ద్వారా వివిధ ప్రాంతాలకు నీటిని అందిస్తున్నట్లు చెప్పారు.
➤ రాబోయే ప్రాజెక్టులు & పట్టాల పంపిణీ: విశాఖలో 28 వేల మందికి పట్టాలిచ్చామని, విజయవాడలో 24 వేల మందికి పట్టాలివ్వబోతున్నామని వెల్లడించారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌కు, త్వరలో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం-రామాయపట్నం మధ్య దగదర్తి ఎయిర్‌పోర్టుతో నెల్లూరు-ప్రకాశం జిల్లాలను లాజిస్టిక్స్ హబ్‌గా మారుస్తామని, బీపీసీఎల్ ప్లాంట్ ద్వారా రూ. లక్ష కోట్ల పెట్టుబడి రాబోతోందని ప్రకటించారు. డిఫెన్స్ పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
ఉదయగిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వరాలు & నిధుల మంజూరు:
➤ పెద్దిరెడ్డి పల్లె రిజర్వాయర్ కాలువ పనులకు రూ. 52 కోట్లు మంజూరు.
➤ సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-1 నిర్మాణానికి రూ. 85 కోట్లు కేటాయింపు.
➤ కనిగిరిలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కోసం రూ. 100 కోట్లు మంజూరు.
➤ కనిగిరి గ్రామంలో రోడ్లు, బీటీ రోడ్ల పునర్నిర్మాణానికి వీబీజీ రామ్ జీ గ్రాంట్.
➤ రాళ్లపాడు రిజర్వాయర్ ద్వారా ఓలేటివారి పాలెం, గూడూరు, లింగసముద్రం మండలాల తాగునీటి సమస్య పరిష్కారం.
➤ క్రాకటూరు డిస్ట్రిబ్యూటరీ, వింజమూరు సాగు, తాగునీటికి రాజవోలు ఎత్తిపోతల పథకం పూర్తి.
➤ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు అవసరమైన క్లియరెన్సులు, సీబీజీ (CBG) ప్లాంట్‌కు నిరంతర విద్యుత్ సరఫరా.
➤ సోమశిల డ్యామ్ భద్రతకు అవసరమైన నిధుల సమకూర్పు.
➤ కనిగిరి-బల్లిపల్లె వద్ద ట్రిపుల్ ఐటీ (IIIT) ఏర్పాటుకు సహకారం.
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత తమదని, అభివృద్ధికి అడ్డుపడితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.